యూనిఫాం సర్వీసెస్ పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. సబ్ ఇన్‌స్పెక్టర్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్బీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు శనివారం(జులై 30) నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు.
పోలీస్, ఫైర్, జైళ్ల శాఖ, ఎక్సైజ్, రోడ్డు రవాణాశాఖల్లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ జరీ చేసింది. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరగనుండగా, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ప్రిలిమినరీ పరీక్షలో 200 మార్కులకుగాను 30 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. 30 శాతం మార్కులు దాటిన అభ్యర్థులు తర్వాతి దశకు వెళ్తారు.
ఎస్సై ప్రిలిమ్స్ వివరాలు:
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్:
ఇదీ చదవండి: SCCL Recruitment: సింగరేణిలో 1300 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆగష్టు 6 చివరి తేదీ.!
ఇదీ చదవండి: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు 89 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!