తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. గత కొంత కాలంగా ఉన్న పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌ను మరో 15 రోజులకు పొడిగించింది. కొంత మంది వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కడం.. చలానాలు విధించినప్పటికీ వాటికిన కట్టకుండా ఉండటంతో ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చలాన్లకు రాయితీ విధానం తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ చాన్సు ఇవ్వడంతో చాలా మంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు క్లీయర్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని పోలీసులు గతంలో తెలిపారు.
పోలీస్ శాఖ వారు అనుకున్నదానికన్నా ఎక్కువ స్పందన రావడంతో క్లియరెన్స్ గడువు పొడిగింపు ఉండదని మంగళవారం నాడు ప్రకటించిన పోలీసు శాఖ.. బుధవారం నాటికే తన విధానాన్ని మార్చుకుంది. వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది.