వాన అంటే అందరికి ఇష్టమే. అలా చినుకులు పడుతుంటే పరవశించి చిందులు వేయాలని ఎవరికి ఉండదు? కాకుంటే వాన వచ్చిన ప్రతిసారి వర్షం సినిమాలో త్రిషలా స్టెప్పులు వేయాలంటే రియల్ లైఫ్ లో సాధ్యం అయ్యే పని కాదు. అయితే.., ఇక్కడ ఓ వృద్ధుడు మాత్రం త్రిషలా కాకపోయినా.., వర్షం పడుతుంటే నిషాలో బాలయ్య బాబు పాటకి అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.., ఈ సంఘటన ఎక్కడ జరిగిందని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో అన్నీ చోట్లా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొన్ని రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే.., ఈ జిల్లాలోని ఉట్నూరు మండలంలో నివాసం ఉంటున్న ఓ వృద్దుడికి.. చలికి రెండు పెగ్గులు వేసుకోవాలి అనిపించింది. అనిపించిందే తడువుగా డబ్బు తీసుకుని వైన్స్ కి వెళ్లి ఫుల్ గా తాగేశాడు.
అతను ఇంటికి చేరే సమయానికి మళ్ళీ వర్షం మొదలవ్వడంతో గొడుగు పట్టుకుని .. నిదానంగా ఐబీ చౌరస్తా దగ్గరకి చేరుకున్నాడు. కానీ.., అక్కడ ఓ మ్యూజిక్ షాప్ లో బాలయ్య వాన పాట ప్లే అవుతుండటంతో ఆ వృద్ధుడు అక్కడే ఆగిపోయాడు. గొడుగు పట్టుకుని పాటకి లయబద్ధంగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు.
అసలే నిషా. పైగా బాలయ్య బాబు సూపర్ హిట్ సాంగ్. ఆ వృద్ధుడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తనని తాను మరచిపోయి డ్యాన్స్ వేశాడు. కొంత మంది యువకులు అతని డ్యాన్స్ ని వీడియో తీసి.., సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో.., ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ కూడా తమాషాగానే స్పందించారు. ఆ వృధ్దిడిది నిజమైన సంతోషం అని.., ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఆ ఆనందాన్ని పొందలేమని కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.