Telangana News : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ట్విటర్ ద్వారా తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించటంలో ముందుండే ఆయన ఈసారి ఇద్దరు యువతుల ఉన్నత చదువు కోసం ఆర్థిక సాయం చేయటానికి ముందకు వచ్చారు. వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కావేరీ(21), శ్రావణి(18) ఇంటర్ మీడియట్ పూర్తి చేశారు. కావేరీ ఇంటర్‌మీడియట్‌లో 95శాతం మార్కులు సాధించింది. సిద్ధిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎమ్‌బీబీఎస్ చదవటానికి అడ్మిషన్‌కూడా లభించింది. శ్రావణి ఇంటర్‌మీడియట్లో 97శాతం మార్కులు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి గూడెం ఎన్‌ఐటీ బీటెక్ చదివేందుకు అడ్మిషన్ దొరికింది. మెరిట్ కారణంగా వీరిద్దరూ ఫ్రీ సీట్లు సాధించారు.
అయితే, హాస్టల్, మెస్ ఇతరు ఫీజులు చెల్లించటానికి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారాయి. వీరి తండ్రి రాజమల్లు కోవిడ్ కారణంగా టీచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ప్రస్తుతం దినసరి కూలీగా పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు భారంగా మారాయి. ఆర్థిక సాయం చేసే వారి కోసం వేచి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల గురించి కేటీఆర్ తెలుసుకున్నారు. వారి ఉన్నత చదువులకు సాయం చేయటానికి ముందుకు వచ్చారు. ఇద్దర్నీ తన దగ్గరకు పిలుచుకున్నారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. చదువులు పూర్తి అయ్యేవరకు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఆర్థిక సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.