Telangana News : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా వేదికగా మంగళవారం మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో తాను ఓ కీలక ప్రకటన చేయబోతునట్లు ప్రకటించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆయన ఏ ప్రకటన చేయబోతున్నారనే దాని గురించి ముఖ్యంగా నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ రేపు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడనున్నారా?.. లేక ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడనున్నారా? అన్నది వేచి చూడాల్సిందే. రేపటి కేసీఆర్ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.