ప్రపంచంలో దేనినైనా కొల్లగొట్టొచ్చు.. దోపిడీ చేయొచ్చు, కానీ ఒక్క విద్యను మాత్రం ఎవరూ తస్కరించలేరు. ‘విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం’ అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను, సామాజిక విలువలను ఒంటబట్టించేది విద్య. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా పేదరికంలో మగ్గిపోతున్న విద్యార్థులకు చేయూతనిస్తూ వారికి మంచి భవిష్యత్ కలిగేలా చేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికం వలన ఉన్నత విద్య అందుకోలేకపోతున్న ఇద్దరు బాలికలు ఆర్థిక సహాయం అందించారు మంత్రి కేటీఆర్. వరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు, తల్లి గృహిణి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిల ఫీజులు ఎలా చెల్లించాలో వారికి అర్థం కాక ఆందోళన చెందింది.
ఇది చదవండి: బ్రేకప్ సిరి వల్ల కాలేదు.. అసలు కారణం ఇదే: షణ్ముఖ్
ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఆ విద్యార్థిని ప్రగతి భవన్‌కు పిలిపించి రూ. 5 లక్షల నగదును కేటీఆర్ అఖిలకు అందజేశారు. కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని.. పేద ప్రజలకు సేవ చేయాలని అఖిలకు మంత్రి సూచించారు. తనకు ఆర్థికంగా అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు అఖిల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
స్పందన తల్లిదండ్రులు దినసరి కూలీకి వెళ్తూ ఆమెను చదివించారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి మెరిట్ ర్యాంక్ సాధించింది స్పందిన. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ స్పందనతో పాటు ఆమె కుటుంబసభ్యులను ప్రగతిభవన్‌కు పిలిపించి ఎంబీబీఎస్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ ఎంబీబీఎస్ ఆశ నెరవేరదన్న ఆందోళనతో ఉన్న తమకు, మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం చేయడంపై అఖిల, స్పందన సంతోషం వ్యక్తం చేశారు.
Minister @KTRTRS met two meritorious MBBS students Akhila & Spandana in Hyderabad & provided financial assistance to pursue their course. The two students had earlier reached out to Minister via Twitter. pic.twitter.com/zRUcfbXtyN
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 14, 2022