ఈ మధ్య కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పక్కన ఉన్న ఏపీకి ఏమాత్రం తీసిపోవడం లేదు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పక్కన ఉన్న ఏపీకి ఏమాత్రం తీసిపోవడం లేదు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై మాటల దూకుడు పెంచారు. అయితే వారి మాటలకు ధీటుగా అధికార పార్టీ నేతలు సైతం సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా ఆర్థిక, వైద్య శాఖ మంత్రి టి.హారిశ్ రావు బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు ఒరిగిందేమి లేదని, పైగా అవినీతి పెరిగిందంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వలన దేశ ప్రజలు కలిగిన ప్రయోజనం ఏం లేదని, పైగా అవినీతి బాగా పెరిగిందని మంత్రి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పెరిగిందని, తప్పులు, అప్పులు చేయడం కేంద్రానికి అలవాటేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. నోట్ల రద్దు, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విఫలమైనట్లు స్వయంగా కేంద్రమే అంగీకరించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవి అన్ని అబద్ధాలేనని.. దొంగనోట్ల సంఖ్య 54 శాతం పెరిగినట్లు స్వయంగా ఆర్‌బీఐ చెప్పిందన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..” ప్రస్తుతం దేశ జీడీపీలో 13 శాతానికి పైగా నగదు చలామణిలో ఉంది. పెద్ద నోట్ల వాడకం పరిమితం కాకపోగా, రెట్టింపు అయింది. నోట్ల రద్దు లక్ష్యాలు నెరవేరలేదని.. ప్రధాని చెబుతున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఒక పెద్ద జోక్ గా ఉంది. నోట్ల రద్దు సమయంలో డబ్బుల కోసం బ్యాంకుల వద్ద క్యూలైన్‌లో నిలబడి 108 మంది చనిపోయారు. అంతేకాక కొత్త నోట్ల తయారీ కోసం ఆర్‌బీఐ రూ.21 వేల కోట్లు ఖర్చు చేసింది. అంతేకాకుండా దాదాపు 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. బీజేపీ తొమ్మిదేళ్ల కాలంలో 100 లక్షల కోట్ల అప్పు చేసింది” అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మరి.. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.