జనాలకు సమస్యలు వస్తే.. పోలీసులను ఆశ్రయిస్తారు. అలా కాదని.. అధికారులే ప్రజలపై పడి దాడి చేస్తే.. అందునా ఓ మహిళ మీద. ఇలాంటి సంఘటనే జగిత్యాలలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కండక్టర్ వారికి సర్ది చెప్పి.. వివాదాలకు చెక్ పెడతాడు. కొన్నిసార్లు పరిస్థితి చేయి దాటితే.. పోలీసులకు సమాచారం ఇస్తారు. వారు వచ్చి.. ప్రయాణికుల మధ్య విబేధాలను పరిష్కరిస్తారు. కానీ ఇప్పుడు చూడబోయే సీన్ పూర్తిగా రివర్స్. బస్‌లో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ఇంతలో సడెన్‌గా ఓ పోలీసు అధికారి బస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గొడవను ఆపడానికి వచ్చాడేమో అని ప్రయాణికులంతా అనుకున్నారు. కానీ అతడు చేసిని పనికి అందరూ భయంతో వణికిపోయారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఈ సంఘటన కరీంనగర్ జిల్లా, జగిత్యాలలో చోటు చేసుకుంది. బస్‌లో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. వీరిలో ఒక మహిళ భర్త ఎస్సై. ఇంకేముంది మాటర్ తెలిగానే.. సదరు అధికారి సినిమా స్టైల్లో బస్‌ను చేజ్ చేసి మరీ అక్కడకు వచ్చి.. తన భార్యతో గొడవపడిన యువతి మీద దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాధితురాలి పేరు షేక్ ఫర్హా(22). ఎంబీఏ చదువుతోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం జగిత్యాల వెళ్లేందుకు.. తల్లితో కలిసి ఆర్టీసీ బస్ ఎక్కింది. వీరితో పాటు మరో మహిళ బస్ ఎక్కడం.. ఫర్హా కూర్చున్న సీట్లోనే కూర్చోవడం జరిగింది.
ఇక బస్ వెళ్తోన్న సమయంలో.. సీట్ విషయంలో వారి మధ్య వివాదం ప్రారంభం అయ్యింది. సదరు మహిళ.. కొంచె జరగాలంటూ ఫర్హా, ఆమె తల్లిని విసిగించడంతో.. గొడవ ప్రారంభం అయ్యింది. ఫర్హా, సదరు మహిళ గొడవపడ్డారు. కాసేపటికి మహిళ.. వెనక సీట్లోకి వెళ్లింది. కొద్ది సమయం తర్వాత మళ్లీ ఫర్హా కూర్చున్న సీటు దగ్గకు వచ్చి కూర్చుంది. అంతేకాక తన భర్త ఎస్సై అని.. ఈ గొడవ గురించి అతడికి చెప్పానని.. కాసేపట్లో వచ్చి.. మీ సంగతి చెప్తాడని.. ఫర్హా, ఆమె తల్లిని బెదిరించింది.
చెప్పినట్లుగానే.. బస్ జగిత్యాల డిపో వద్దకు చేరుకోగానే.. సదరు మహిళ భర్త.. ఎస్సై అనీల్, మరో కానిస్టేబుల్‌తో కలిసి.. కారులో వచ్చి బస్‌ను అడ్డుకున్నారు. లోపలికి ఎక్కి.. తన భార్యతో ఎవరు గొడవపడ్డారంటూ అసభ్య పదజాలంతో తిట్టాడు. అనీల్ భార్య.. ఫర్హా, ఆమె తల్లిని చూపించగానే.. వారికి వద్దకు వచ్చి.. తీవ్రంగా తిడుతూ.. బెదిరించసాగాడు. అనీల్ రియాక్షన్‌తో భయపడిన ఫర్హా తన ఫోన్‌లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్‌కి నంబర్ పంపింది.
అది గమనించిన ఎస్సై అనిల్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ.. ఫర్హా మీద చేయి చేసుకున్నాడు. ఆమె జుట్టుపట్టి మరీ బస్సు నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. అనీల్ భార్య ఆ అమ్మాయి తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా వారంతా చూస్తున్నారే కానీ.. ఏవరూ అనీల్‌ను ఆపే సాహం చేయకపోవటం గమనార్హం. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అనీల్‌ని నిలదీసింది. ఆమె మీద ఆగ్రహంతో.. సదరు యువతి ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఎస్సై.
బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు జగిత్యాల టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి 12 గంటల వరకు పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్నారు. కానీ ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవటం గమనార్హం. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.