విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ తో కూడిన ట్యాబ్ లను అందజేశారు.
విద్యార్థుల చదువులు ఇప్పుడు మారిపోయాయి. పెరిగిన సాంకేతికతను వాడుకుని విద్యార్థులు క్లాసుల్లో నేర్చుకునేదాని కంటే కూడా ఆన్ లైన్ లోనే ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ఈ డిజిటల్ యుగంలో పేపర్ వినియోగాన్ని తగ్గించాలంటే ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ లు వంటివి వాడాల్సిందే. చేతిలో ట్యాబ్ ఉంటే విద్యార్థులు ఏ సమయంలో అయినా చదువుకునే వీలు ఉంటుంది. ఇక అందులో స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. పరీక్షలకు కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా బాగా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల కోసం ఉచితంగా ట్యాబ్ లు పంచిపెడుతున్నాయి.
తాజాగా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధన ప్రమాణాలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కనీస సౌకర్యాలను కల్పిస్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2 వేల మంది విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ఉచితంగా ట్యాబులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించారు. గతంలో వెయ్యి ట్యాబ్ లు అందజేశామని.. ఇప్పుడు 2 వేల ట్యాబ్ లు అందజేశామని అన్నారు. ట్యాబులతో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ట్యాబ్ లను సరిగా వినియోగించుకుంటే విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అద్భుతమైన ఫలితాలు పొందుతారని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్తే.. వారి తల్లిదండ్రులే కాదు.. ప్రభుత్వం కూడా సంతోషిస్తుందని అన్నారు.
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 2000 మంది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్‌లను మంత్రి శ్రీ కేటీఆర్ అందజేశారు.#GiftASmile pic.twitter.com/XvbUONnY63
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 28, 2023
ట్యాబ్ ధర రూ. 10 వేలు కాగా, స్టడీ మెటీరియల్ ధర రూ. 75 వేలు అని.. మొత్తంగా ఒక్కో ట్యాబ్ కి రూ. 85 వేలు పెట్టుబడి పెట్టమని అన్నారు. ఆ ట్యాబ్ లను ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేశామని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ట్యాబ్ లు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం గంభీరావుపేట మండలంలో ఉన్న కేజీ టు పేజీ క్యాంపస్ కి ధీటుగా ఎల్లారెడ్డిపేట జూనియర్ కాలేజీని కార్పొరేట్ విద్యాసంస్థ తరహాలో రూ. 7 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తామని అన్నారు. కాలేజ్ గ్రౌండ్ మినీ స్టేడియంగా మారుస్తామని అన్నారు. మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తో కూడిన ట్యాబ్ లను అందజేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.