జూన్ వరకు బడులకు, కాలేజీలకు వెళ్లాల్సిన పని లేదు. ఇక టూర్లు వెళ్లాలంటే ఇదే మంచి సమయం కాబట్టి.. పలువురు తల్లిదండ్రులు అదే పనిలో పడ్డారు. ఇక తెలంగాణ హైకోర్టుకు కూడా వేసవి సెలవులను ప్రకటించారు.
ఎండాకాలం మొదలైంది. ఏడాది చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసే తుది పరీక్షలు కూడా ముగియడంతో అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణాలోనూ బడులకు, ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రకటించేశాయి ప్రభుత్వాలు. జూన్ వరకు బడులకు, కాలేజీలకు వెళ్లాల్సిన పని లేదు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలన్నా, ఇక టూర్లు వెళ్లాలంటే ఇదే మంచి సమయం కాబట్టి.. పలువురు తల్లిదండ్రులు అదే పనిలో పడ్డారు. ఇక తెలంగాణ హైకోర్టుకు కూడా వేసవి సెలవులను ప్రకటించారు. ఈ సమయాల్లో కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యవసర కేసులను మాత్రమే చాలా వరకు విచారణ జరుగుతాయి.
తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులను ప్రకటించారు. మే 1 నుండి జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర కేసుల విచారణ నిమిత్తం ప్రతి గురువారం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయనున్నారు. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. కాగా, ఆంధ్రపదేశ్‌లో వేసవి సెలవుల గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.