తెలంగాణ సీఎం కేసీఆర్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా కలెక్టర్, పలువురు అధికారులకు సైతం న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ విషయం రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అధికార పార్టీ టీఆర్ఎస్ కి సంబంధించిన కార్యాలయాలకు గాను భూమిని కేటాయించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ కార్యాలయానికి బంజారాహిల్స్లో ఏకంగా 4,935 గజాలు కేటాయించడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. అంతేకాదు ఇందుకోసం అక్కడ భూమిని కేవలం వందరూపాయలకే గజం చొప్పున కేటాయించడంపై విశ్రాంత ఉద్యోగి మహేశ్వర్ రాజ్ అనే వ్యక్తి హై కోర్టు దృష్టికి తీసుకు వెళ్లి పిటీషన్ దాఖలు చేశారు.
ఈ విషయంపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు కేసీఆర్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు అధికారులకు నోటీసు జారీ చేసింది. అంతేకాదు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులో పేర్కొంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.