ప్రేమకి భాష, ప్రాంతం, కులం, మతం, దేశం వంటి సరిహద్దులు ఉండవు. మనుషులకి, మనసులకి సంబంధించిన ప్రేమ. ఎప్పుడైనా ఎవరికైనా ఎవరి మీదనైనా ప్రేమ పుడుతుంది. అదృష్టం ఉంటే ఆ ప్రేమ పెళ్ళి అనే రెండక్షరాల మాటతో ఒకటవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కూడా అలాంటిదే. తెలంగాణ కుర్రాడు ఉద్యోగం కోసం వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ బంగ్లాదేశీ అమ్మాయితో లవ్‌లో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడే పెళ్ళి చేసుకున్నారు. కట్ చేస్తే ఆ కుర్రాడు ఇండియా వచ్చాడు. ఆ తర్వాత కరోనా కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. రెండేళ్ళ తర్వాత ఇండియా వచ్చింది అతని భార్య. ఆ తర్వాత పెద్దలు ఏం చేశారంటే?..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలానికి చెందిన గుమ్మల హరీష్ ఐదేళ్ళ క్రితం జాబ్ నిమిత్తం జోర్డాన్ దేశానికి వెళ్ళాడు. అదే దేశానికి ఉపాధి కోసం వచ్చిన రోషి అనే బంగ్లాదేశీ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా చిగురించడంతో నాలుగేళ్ళ క్రితమే జోర్డాన్‌లో వివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్ళ క్రితం ఇంటికి వచ్చిన హరీష్.. కోవిడ్ కారణంగా తిరిగి జోర్డాన్ వెళ్ళలేకపోయాడు. పాస్‌పోర్ట్ రెన్యూవల్ ఉండడం, కోవిడ్ పరిస్థితుల వల్ల రిషి కూడా ఇండియా రాలేకపోయింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఆమె నెల రోజుల కిందట హరీష్ ఇంటికి వచ్చింది. దాదాపు రెండేళ్ళ తర్వాత రోషి తన భర్తను కలుసుకుంది. దీంతో తమ సమక్షంలో ఇద్దరికీ వివాహం జరిపించాలని హరీష్ తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆదివారం మంచి ముహూర్తం కావడంతో వేల్పూర్‌లోని వెంకటాపూర్ వేంకటేశ్వర ఆలయంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.