కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు పాఠశాల, కాలేజీ విద్యార్థుల విషయంలో తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారికి ఆర్ధిక భరోసా ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకుంటాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు పాఠశాల, కాలేజీ విద్యార్థుల విషయంలో తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారికి ఆర్ధిక భరోసా ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకుంటాయి. విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను ప్రభుత్వాలు అందిస్తున్నాయి. విద్యార్థులకు సైకిళ్లు, ట్యాబ్ కూడా పంపిని చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. పాఠశాల విద్యపై నూతన సచివాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ నూతన సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పాఠశాలలకు సంబంధించిన పలు విషయాలపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధుల పాఠ్యపుస్తకాల గురించి ప్రస్తావన వచ్చింది. ప్రైమరీ స్కూల్స్ విద్యార్థులకు వర్క్స్ బుక్స్, హై స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇక విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో నోటు బుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించాలని.. పిల్లల తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు మంత్రి సూచించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వ బడుల్లోని విద్యార్ధులందరికీ రెండు జతల యూనిఫామ్ లను అందించాలని మంత్రి సూచించారు. విద్యార్ధులకు పంపిణీ చేయనున్న ఈ యునిఫామ్ల కోసం సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె తెలిపారు.
గత విద్యాసంవత్సరంలో కూడా పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం టీఎస్ ప్రభుత్వం రూ.132 కోట్లు ఖర్చు చేసిందని, 2023-24 విద్యా సంవత్సరానికి గాను రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ఓపెన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ రోజున అన్ని పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఇక “మన ఊరు – మన బడి”కి సంబంధిచిన పనులను జూన్ మొదటి వారంలోగానే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలానే ఈ సారి విద్యార్థుల యూనిఫామ్ రంగు మారనుందని ఆమె తెలిపారు. మరి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.