దేశంలో ఏ వ్యాపార రంగంలో అయినా నష్టాలు ఉండొచ్చు.. కానీ మద్యం వ్యాపారంలో మాత్రం ఎప్పుడూ నష్టాలు.. కష్టాలు అనేవి ఉండవు. అంతగా ప్రజలు మద్యాన్ని ఇష్టపడుతుంటారు. ప్రతి చిన్న ఫంక్షన్ కి మందు లేనిదే ముందుకు సాగదు..
దేశంలో ఎలాంటి రంగంలో అయినా సరే ఆదాయాలు పెరిగినా తగ్గినా అది ఒక్క మద్యం వ్యాపారంలో మాత్రం మూడు పూవులు.. ఆరు కాయలు గా లాభాల బాటలో నడుస్తూను ఉంటుంది. ఒక రకంగా రాష్ట్రాలకు మంచి ఆదాయం ఈ మద్యమే అంటారు. ఎందుకంటే మద్యానికి ప్రజల్లో అంత డిమాండ్ ఉంది. పుట్టుకైనా.. చావు అయినా మద్యం పారాల్సిందే. అందుకే మద్యం వ్యాపారులు లాభాల బాటలో టాప్ పొజీషన్లో ఉంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త తెలిపింది. వివరాల్లోకి వెళితే..
మందుబాబులకు యమా కిక్కి ఇచ్చే వార్త.. రాష్ట్రంలో మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని కొంతమేర తగ్గించడంతో బీరు మినహా లిక్కర్ కి అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. క్వార్టర్ పై రూ.10, హాఫ్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.40 మేర ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిసింది. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యం అక్రమ రవాణా జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు… ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిదని ఎక్సైజ్ అధికారులు వివరించారు. ఈ వార్తతో మద్యం బాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.