మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిటలాడుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు భక్తులు ఎంతో నియమనిష్టతో ఉపవాసం ఉంటారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమశివున్ని భక్తితో స్మరిస్తూ ఉంటారు.
నేడు మహాశివరాత్రి.. ఈ సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిటలాడుతున్నాయి.. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేములవాడ, వేయి స్తంబాల గుడి, రామప్ప మొదలైన ఆలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి వేడుకల కోసం ముస్తాబైంది. ప్రతి సంవత్సరం రాజన్నకు తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. తెలంగాణ సర్కార్ తరుపు నుంచి ఈ ఏడాది దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు.
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామికి వారికి తెలంగాణ ప్రభుత్వం తరపునుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ ఏడాది రాజన్నకు తెలంగాణ సర్కార్ తరుపు నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు టీటీడీ తరపున డిప్యూటీ ఈవో హరింద్రనాథ్ ములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారోమోగుతుంది.
ఇక మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు లక్షల్లో తరలివస్తుంటారు.. ఈ సందర్భంగా వసతీ ఏర్పాట్లను ఆలయ ఈవో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు పూర్తి చేశామని అన్నారు. ఇక పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలయ సిబ్బందితో పాటుగా మున్సిపల్ కార్మికులను, తాత్కాలిక కార్మికుల సేవలు ఉపయోగించబోతున్నట్లు తెలుస్తుంది. రాత్రి జాగరణ చేసే భక్తుల కోసం శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఇందుకోసం వివిధ ప్రదేశాల నుంచి కళాకారులు తరలివచ్చినట్లు సమాచారం. శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు భక్తులు ఎంతో నియమనిష్టతో ఉపవాసం ఉంటారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమశివున్ని భక్తితో స్మరిస్తూ ఉంటారు.