అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురైయ్యారు.
హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి చంపేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయిలో తెగ వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో వీధి కుక్కలు బెడద తీవ్రంగా ఉందని.. అధికారులకు ఎంతగా చెప్పినా చలనం లేదని.. వీటి నిర్మూలనలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
అంబర్ పేట ఘటన తర్వాత రాష్ట్రంలో మరికొన్ని చోట్లు వీధి కుక్కలు చిన్నపిల్లలపై దాడులు చేయడంపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రణ చేపట్టాలని మున్సిపాలిటీ, గ్రామ పరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుక్కలకు వందశాతం స్టెరిలైజేషన్ చేయాలని సూచించింది. అంతేకాదు కుక్కలను పట్టుకునేందుకు బృందాలు, వాహనాల సంఖ్య కూడా పెంచాలని తెలిపింది. ఎక్కడ కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయో అధికారులు అక్కడ ప్రత్యేక దృష్టి సారించి వాటిని నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు.
కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని.. స్కూల్ విద్యార్థులకు కుక్కల నుంచి ఎలా రక్షించుకోవాలన్న విసయంపై అవగాహన కల్పించాలని పేర్కొంది. అంతేకాదు గత కొంత కాలంగా మాంసం దుకాణాలు, ఫంక్షన్ హళ్లలో మిగిలిపోయే మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వీటికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయాలని జీహెచ్ఎంసీ, సంబంధిత శాకలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు దీనిపై ప్రజలకు అవగాహన కూడా కల్పించాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన అంబర్‌పేట ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఈ నేపథ్యంలో కుక్కలు, కోతుల బెడద నుంచి నివారణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల హాస్టల్స్, హూటల్స్, రెస్టారెంట్స్ లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను చెత్త కుప్పల్లో, ఖాళీ ప్రదేశాల్లో వేయడంతో కుక్కలు అక్కడికి ఎక్కువగా చేరుతున్నాయని.. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిపై నియంత్రణ కొనసాగితే కుక్కల బెడద కొంతవరకు తగ్గించుకోవొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాంసం వ్యర్థాలను దుకాణదారులు ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై వేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.