తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల భూముల విషయాలపై వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే ధరణి పోర్టల్ వంటి వాటిని తీసుకొచ్చి భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సరికొత్తగా ముందుకు వెళ్లింది.
ఇక తెలంగాణ సర్కార్ ధరణి పోర్టల్ ని ముందుకు తేవటంతో ఒక వైపు విమర్శలు, మరోవైపు ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక విషయం ఏంటంటే..? ధరణి పోర్టల్ లాగిన్ సౌకర్యాన్ని తెలంగాణ సర్కార్ డిప్యూటీ తహశీల్దార్ లకు అప్పగించారు. ఇక తాజాగా భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను కూడా ఇకపై డిప్యూటీ తహశీల్దార్ లే చూసుకోవాలంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.