తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తిపికబురును అందించింది. ఇప్పటికే ఉద్యోగ నోటీఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇక తొందరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.
ఇది కూడా చదవండి: యన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు పరిస్థితి దిగజారిపోయింది: కొడాలి నాని
తాజాగా దీనికి సంభందించి ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎగిరిగంతేస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.