సమాజంలో మహిళలు వివక్షతకు గురవవుతూనే ఉన్నారు, వారికి సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళల కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో పై వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ..” మేము సమాన హక్కులకు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఇంక వివక్షత ఎదుర్కోనే పరిస్థితులు రావడం బాధకరం. భారతీయ మహిళ దేనికి భయపడదు,నేను దేనికి భయపడను. నన్ను ఎవరూ భయపెట్టలేరు. ఆకాశం తలపై పడినా.. నేను భయపడనను. మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలి. మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడమే మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం” అని తమిళిసై అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సంప్రదాయానికి భిన్నంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సోమవారం టీఆర్ఎస్ సర్కారు ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ కొత్త పధ్ధతిపైనే కాకుండా తనను అసెంబ్లీకి రానీయకుండా చేసిన వైనంపై తమిళిసై ఇప్పటికే ఘాటుగా స్పందించారు. తనను అసెంబ్లీకి పిలవకుండా తన నోటితో టీఆర్ఎస్ రిపోర్ట్ కార్డును చదివించుకునే అవకాశాన్ని ఆ పార్టీ నేతలు చేజార్చుకున్నారని తమిళిసై తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. మహిళ దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ వ్యాఖ్యాలు చేశారు. మరి.. గవర్నర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.