వేసవి కాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. పాఠశాలల సమయాన్ని ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు తగ్గించింది.
కరోనా కారణంగా ఇప్పటికే పాఠశాలలు ఆలస్యంగా తెరిచారు. అందువల్ల మరో నెల రోజుల పాటు విద్యాసంస్థలు నడుస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎండలు మండిపోవడంతో ప్రభుత్వం పాఠశాలల సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాలలను గురువారం(మార్చి31) నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉదయం 8గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, కస్తూర్బా పాఠశాలలు, మోడల్స్ స్కూల్ను నడపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మారిన సమయాలను పాటించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. వచ్చే 4 రోజులు జాగ్రత్త..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.