తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యశోదా ఆస్పత్రి వైద్యుడు ఎంవీ రావు మాట్లాడుతూ… కేసీఆర్ రెండ్రోజులుగా నీరసంగా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్పారని తెలిపారు. ఆయనకు అవసరమైన అన్నివైద్య పరీక్షలు చేస్తున్నామని, నివేదికలు వచ్చాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. అస్వస్థత నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్
ప్రస్తుతం కేసీఆర్ కు యాంజీయోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ వెంట ఆయన భార్య, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మనవడు హిమాన్షు ఆస్పత్రికి వెళ్లారు. విషయ తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ యశోద ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎడమ చేయి లాగుతుందని చెప్పడంతో.. గుండె సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అనే అనుమానంతో అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో 10 నిమిషాల్లో దీనికి సంబంధించిన రిపోర్టులు రానున్నాయి అన్నారు. అలసట కారణంగా ఇలా జరిగిందా.. లేక ఏవైనా సమస్యలు తలెత్తాయా అనే విషయం మరికాసేపట్లో తెలియనుందని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ భాష ఉంటే తెలుగు సినిమా హిట్: కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇటీవల వరుస పర్యటనలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవల ముంబయి, ఢిల్లీలో పర్యటించారు. అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలోనే ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అయితే వరుస పర్యటనలు, అధికారులతో సమీక్షల కారణంగా ఒత్తిడికి గురికావడం వల్లే కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రిపోర్టులు వస్తే.. దీని గురించి స్పష్టత రానుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.