తెలుగు ఇండస్ట్రీకి దాసరి నారాయణ తర్వాత ఆ స్థాయిలో అందరిని కలుపుకొని పోతూ.. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించే దిశగా ముందుకు సాగున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏపిలో కొంత కాలం పాటు సినిమా టికెట్స్ విషయంలో పెద్ద రగడే కొనసాగింది. అయితే సినిమా టికెట్ విషయంలో సీఎం జగన్ ని కలిసి ఇండస్ట్రీ కష్టాలు తెలిపి టికెట్ రేట్లు పెరిగేలా చేసిన మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు కరోనా సమయంలో సినీ కార్మికులకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చి వారికి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీ కోసం పాటుపడుతున్న మెగాస్టార్ చిరంజీవిని పెద్దన్నగా చెప్పుకుంటారు చాలామంది సినీ ప్రముఖులు. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు ఎవరు పెద్ద దిక్కు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోవైపు ఇండస్ట్రీ విషయంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వస్తున్నారు చిరంజీవి. ఇటీవల ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాదు.. కళామల్లి బిడ్డను మాత్రే అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఎదుటి వారి కష్టాల గురించి ఆలోచించి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న మెగాస్టార్ చిరంజీవిగారే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నారు. అలాగే ఈ అసోసియేషన్ కి తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అసోసియేషన్ కు 5 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు.