అయ్యయ్యో వద్దమ్మ అంటూ ఓవర్‌నైట్ స్టార్ అయిన మాస్ డాన్సర్ శరత్ టిక్‌టాక్, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ఒకప్పుడు తనను ఫేమస్ చేయాలంటూ వేడుకున్న శరత్.. తర్వాత తన టాలెంట్‌తోనే గుర్తింపు సాధించాడు. ఇన్‌స్టా వేదికగా మీమర్స్‌కు మంచి సబ్జెక్ అయ్యాడు. తాజాగా శరత్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. కొందరయితే అతను యాడ్‌ను రీమేక్ చేసినందుకు హిజ్రాలు దాడి చేశారంటూ పుకార్లు పుట్టించారు. ఆ విషయంపై మొదటిసారి శరత్ స్పందించాడు. తనని అసలు కొట్టింది ఎవరో మీడియా ముందుకు వచ్చి బయట పెట్టాడు.
తనను హిజ్రాలు కొట్టారనే పుకార్లను ఖండించిన శరత్ అసలు దాడి చేసింది ఎవరనే విషయాన్ని బయటపెట్టాడు. తన చెల్లిని ఎవరో పోకిరీలు ఏడిపిస్తుంటే వారిని కొట్టినందుకు జైలుకెళ్లినట్లు శరత్ తెలిపాడు. మరోవైపు తన సుఖీభవ డాన్స్ బాగా ఫేమస్ అవ్వడం కూడా నచ్చక వాళ్లే తనపై దాడి చేశారనే విషయాన్ని శరత్ వెల్లడించాడు. ‘నాకు 3 సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ ఆఫర్ కూడా వచ్చింది. ఆ విషయం నా స్నేహితులకు చెప్పాను. వారి ద్వారా ఎలాగో వీళ్లు తెలుసుకుని నన్ను తొక్కేయాలనే ఇలా చేశారు. ఒకళ్లు ఎదుగుతుంటే వాళ్లనే తొక్కడమేనా? ఎందుకిలా చేస్తున్నారు? పోలీసులు రావడం కాస్త ఆలస్యం అయినా నేను బతికుండే వాడిని కాదు. అందరూ కిందపడేసి నన్ను కొట్టేశారు. నేను స్పృహ తప్పాను’ అంటూ శరత్ భావోద్వేగానికి గురయ్యాడు.
15 మంది విచక్షణారహితంగా తనను కొట్టినట్లు తెలిపాడు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. మరోవైపు హిజ్రాలు దాడి చేశారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై కూడా స్పదించాడు శరత్. వారంతా తనకు అక్క, చెల్లి, అమ్మలాంటి వారేనని.. వాళ్లతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని అన్నాడు. వారిని ఎప్పుడూ గౌరవిస్తాననే చెప్పాడు. శరత్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంnటారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.