హైదరాబాద్ లో మరోసారి వీధి కుక్కల బీభత్సం సృష్టించాయి. బడంగ్ పేట్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఐదేళ్ల బాలుడిపై దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్దవాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా దాడులు చేస్తున్నాయి. గతంలో అంబర్ పేట్ వీధి కుక్కల దాడి ఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే ఇటీవల నగరంలో చాలా చోట్ల కుక్కలు పిల్లలపై దాడి చేశాయి. ఇక తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ కుక్కల దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
శనివారం బడంగ్ పేట్ పరిధిలోని గుర్రంగూడలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న వాచ్ మెన్ కుమారుడు బయట ఆడుకుంటున్నాడు. అయితే అతడిని గమనించిన కొన్ని వీధి కుక్కలు బాలుడి వద్దకు వచ్చి దాడి చేశాయి. ఆ బాలుడు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి కుక్కల దాడి నుంచి ఆ బాలుడిని రక్షించారు. కుక్కల దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ నారాయణగూడ ఆస్పత్రికి తరలించారు. అయితే కుక్కల బేడదను తట్టుకోలేకపోతున్నామని, ఇకనైన అధికారులు మేల్కోని చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు కోరుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో కాలనీ వాసులు భయందోళనలకు గురవుతున్నారు.