దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి 'బీఆర్ఎస్' అగ్రనేతలు అడుగులు వేస్తుంటే, కొంత మంది నేతలు మాత్రం లైంగిక పర్వాలకు తెరలేపారు. అధికార పార్టీకి చెందిన ఓ దళిత మహిళా సర్పంచ్ స్థానిక నేతలు తనను లైంగికంగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
దేశ రాజకీయాల్లో మార్పు తేవాలని ‘బీఆర్ఎస్’ అగ్రనేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ విదితమే. అందుకోసం ఇప్పటికే ‘తెరాస’ పేరును ‘భారాస’గా మార్చిన ప్రభుత్వ పెద్దలు ప్రాంతీయ పార్టీల నేతలను కలుపు గొలుపు మంతనాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీకి చెందిన ఓ దళిత మహిళా సర్పంచ్ తనను లైంగికంగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య, స్థానిక నేతలపై సంచలన ఆరోపణలు చేసింది. ధర్మసాగర్ మండలానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఓ నాయకుడి కోరిక తీర్చమంటూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకుంది. వారి మాట కాదనటంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మీకు అక్కా చెల్లెల్లు లేరా అంటూ లైంగిక రాయబారాలు పంపిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, నేతల కోరికలు తీర్చేందుకు కాదంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది.
ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానిక బీఆర్ఎస్ నాయకుడితో రాయబారం చేశాడన్నది స్థానికంగా ప్రచారం జరిగిన వార్త. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని భరోసా ఇచ్చాడట. ఈ క్రమంలోనే సర్పంచ్ నవ్య మీడియా ముందుకు రావడం స్థానిక నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణలపై స్థానిక బీఆర్ఎస్ నేతలు, అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తారో తెలియాలి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సర్పంచ్
కోరిక తీర్చమని మరొక మహిళా నాయకురాలి ద్వారా రాయబారం పంపినట్లు.. రాజయ్య అన్యాయంగా, అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నాడు అంటూ ఆరోపించిన జానకీపురం సర్పంచ్ నవ్య. pic.twitter.com/xPpEtsNnpw
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2023