Fathers Wax Statue: కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత గట్టి గుండె అయినా తట్టుకోలేదు. వారి జ్ఞాపకాలు మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. ఏళ్లు గడిచినా.. వాళ్లను మరచిపోలేం. మళ్లీ తిరిగి వస్తే బాగుండు అనే ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా శుభకార్యం జరుగుతునప్పుడు వారిని బాగా మిస్ అవుతుంటాం. ముఖ్యంగా అమ్మానాన్నల్లో ఎవరైనా చనిపోతే.. వాళ్లు లేకుండా ఏదైనా శుభకార్యం చేయాలంటే అస్సలు కాని పని. వీళ్ల లైఫ్‌లో కూడా అదే జరిగింది. చనిపోయిన నాన్నను తిరిగి తీసుకురాలేరు కాబట్టి ఓ పని చేశారు. పెళ్లిలో సందడి పెంచారు. తండ్రీకొడుకుల అనుబంధానికి సాక్ష్యంగా నిలిచే ఘటన కర్ణాటకలో కనిపించింది. చిక్కమగళూరు జిల్లా కడూరుకు చెందిన డాక్టర్ యతీశ్ తండ్రి రమేశ్.. కొవిడ్ కారణంగా గతేడాది మరణించారు.
యతీశ్కు ఇటీవల అపూర్వ అనే మరో డాక్టర్తో పెళ్లి కుదిరింది. అయితే నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీష్… తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. అప్పుడే యతీశ్కు ఒక ఐడియా వచ్చింది. తన తండ్రి మైనపు విగ్రహం చేయించాడు. విగ్రహాన్ని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆయన కళ్లెదుటే అపూర్వ మెడలో తాళి కట్టాడు. పెళ్లి మండపంలో తండ్రి మైనపు విగ్రహాన్ని చైర్‌లో కూర్చోబెట్టి వివాహ తంతును ముగించారు. తండ్రి మైనపు విగ్రహం ముందే పెళ్లి, రిసెప్షన్ జరిగింది. యతీశ్ తల్లి.. మైనపు విగ్రహం పక్కనే కూర్చొని పెళ్లి తంతు జరిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రిసెప్షన్ కూడా అదే రీతిలో కొనసాగింది. ఆ తరవాత పక్కనే తల్లిని కూడా కూర్చోబెట్టి ఇద్దరి ఆశీస్సులు తీసుకున్నాడు. కుటుంబసమేతంగా వివాహ వేడుకల్లో ఫొటోలు కూడా దిగారు.
అచ్చం జీవం ఉన్న మనిషిని పోలిన స్టాట్యూను చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీశ్.. తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. భౌతికంగా పక్కన లేకపోయినప్పటికి.. విగ్రహం రూపంలో పెళ్లిలో ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎంతైనా ఈ ఐడియా రావడం గ్రేట్. ఇప్పటికే చాలా మంది ఇలా వారికి ఇష్టమైన వాళ్లు చనిపోతే.. మైనపు విగ్రహాలు చేయించి.. వారి లోటు కనిపించకుండా చేశారు. కాగా నాన్న లేకుండా పెళ్లి చేసుకోలేననిపించింది.. అందుకే కుటుంబంతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పాడు యతీశ్. విగ్రహం పెళ్లిలో ఉంటే.. నాన్న పక్కనే ఉన్నట్లు అనిపించిందని చెప్పాడు. మరి, కొడుకు ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karnataka: వీడియో: గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు.. అవాక్కయిన పోలీసులు!