ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. పలు కంపెనీలు ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు ఉద్యోగుల విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఒక్క కుదుపు కుదిపేసింది. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించాయి. ఆ సంఖ్య ఈ ఏడాది మరింత పెరగవొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా ఉద్యోగాలు పోవొచ్చు అన్న భయం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో మొదలైంది. కొంతమంది ప్రత్యామ్నాయం చూసుకుంటే.. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగా తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పపడ్ట ఘటన నార్సింగ్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పుప్పాల్ గూడలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వినోద్ కుమార్ తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వినోద్ కి వివాహం జరిగింది. ఈ జంటకు బాబు కూడా ఉన్నాడు. ఇటీవల సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారని వార్తలు రోజూ చూస్తున్న వినోద్ కొంతకాలంగా మానసికంగా తీవ్ర ఒత్తికి లోనవుతూ వస్తున్నాడు. తన ఉద్యోగం పోతే భార్యాబిడ్డలను ఎలా పోషించుకోవాలన్న ఆందోళనకు గురి అవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో నుంచి వినోద్ ఎంతకీ రాకపోవడంతో అన్న రాజేష్ కుమార్ తలుపు కొట్టాడు.. ఎలాంటి స్పందన రాకపోవడంతో గది తలుపులు పగటగొట్టి చూడగా ఒక్కసారే నిర్ఘాంతపోయాడు.
గదిలో ఫ్యాన్ కి వేలాడుతూ వినోద్ ని చూసి ఒక్కసారే షాక్ తిన్నాడు రాజేష్. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న తమ్ముడు విగతజీవిగా చూసి కన్నీరు పెట్టుకున్నాడు అన్న రాజేష్. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నార్సింగ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు అంటే భారీ జీతం, లగ్జరీ లైఫ్.. వీక్ ఎండ్ పార్టీలు అని భావిస్తుంటారు. కానీ కరోనా తర్వా అన్నీ తలకిందులైయ్యాయి.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కొత్ భయం పట్టుకుంది. ఎప్పుడు జాబ్ నుంచి ఊస్టింగ్ చేస్తారో అనేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ఏది ఏమైనా ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం ప్రత్యామ్నాయం చూసుకోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని అంటున్నారు నిపుణులు.