సెల్ ఫోన్ ఆర్డర్ చేశాడు.. వచ్చిన పార్శిల్‌ చూసి నోరెళ్లబెట్టాడు..!

నేటికాలంలో చాలా మంది ఏ వస్తువులను కొనాలన్న ఆన్ లైన్ షాపింగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయల మొదలు ప్రతి దానిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కస్టమర్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.

నేటికాలంలో చాలా మంది ఏ వస్తువులను కొనాలన్న ఆన్ లైన్ షాపింగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయల మొదలు ప్రతి దానిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. సమయం, డబ్బులు ఆదా అవుతుండటంతో అందరూ ఆన్ లైన్ షాపింగ్ కు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే చాలా సంస్థలు కూడా ఎన్నో ఎంతో నమ్మకంతో తమ వినియోదారులకు నాణ్యమైన వస్తువులను డెలివరీ చేస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కస్టమర్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ సెల్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఓ యువకుడి ఊహించిన షాక్ తగ్గిలింది. మరి.. అతడి పార్శిలో ఏమి వచ్చింది?.  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన కడిమి జగన్‌‌ అనే వ్కక్తి ఈ నెల 12న ఓ యాప్‌‌లో నోకియా 2660 మోడల్‌‌ ఫోన్‌‌ను ఆర్డర్ చేశాడు. సోమవారం రూ. 1,066 చెల్లించి పార్సిల్‌‌ తీసుకున్నాడు. పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూసి ఒక్కసారిగా విస్తూ పోయాడు. ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఆయనకు ఊహించని షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ భారీ డిస్కౌంట్‌ అని ఆశపడి ఆర్డర్‌పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు. ఆన్‌‌లైన్‌‌లో సెల్‌‌ఫోన్‌‌ ఆర్డర్ చేసిన జగన్ కు పార్సిల్‌‌లో సబ్బుబిల్ల రావటంతో షాకయ్యాడు. దీంతో పార్సిల్ తెచ్చిన డెలివరీ బాయ్‌‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు.

చివరకు ఫోన్ లేదా డబ్బులు ఇస్తేనే గ్రామం నుంచి బయటకు వెళ్తావని డెలివరీ బాయ్ ను హెచ్చరించాడు. చివరకు డెలివరి బాయ్ జగన్ కు డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా తరచూ ఆన్ లైన్ షాపింగ్ లో అనేక వింత ఘటనలు జరుగుతుంటాయి. గతంలో ల్యాప్ ట్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఇనుప వస్తువు వచ్చింది. అలానే టీవీ ఆర్డర్ చేసిన వ్యక్తి ఓ ఆటబొమ్మ వచ్చింది. కొన్ని ఆన్ లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ ఆశ చూపి.. మోసానికి పాల్పడుతున్నాయి. ఫోన్ ఆర్డర్ పెడితే.. సబ్బు వచ్చిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed