ప్రపంచంలో ఎక్కడైనా పాము అంటే ఆమడ దూరం పారిపోతుంటారు. పాము ఉందీ అని తెలిస్తే చాటు అటు వైపు వెళ్లాలంటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే పాములు అత్యంత విష సర్పాలు.. వాటి కాటుకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ స్నేక్ క్యాచర్స్ పరిస్థితి వేరు… ఎలాంటి కాల నాగు అయినా సరే ఎంతో ఓర్పు నేర్పుతో పట్టుకొని అడవుల్లో వదిలి వేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ పాము కాటుతోనే మరణించిన సంఘటనలు జరిగాయి. ఎక్కడ పాము కనిపించినా అతినికి చాకచక్యంగా పట్టుకోవడమే అలవాటు.
పాములను కాపాడటమే హాబీగా పెట్టుకున్న ఓ వ్యక్తి పామును జాగ్రత్తగా పట్టుకొని దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో వదిలేవాడు. గత 12 ఏళ్లుగా ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుంటూ వస్తున్నాడు. కానీ విధి వక్రించింది.. దురదృష్టవశాత్తూ చివరికి ఆ పాము కాటుకే బలయ్యాడు. ఈ విషాద ఘటన భద్రాచలం జిల్లా జరిగింది.సమితి సింగారం గ్రామంలో షరీఫ్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ పాములు కనిపిస్తేవాటిని దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదిలేవాడు. ఓ ఇంటి బావిలో త్రాచు పాము ఉందని సమాచారం తెలుసుకొని ఆ పామును పట్టుకున్నాడు.
తాను పట్టుకున్న పాముతో షరీఫ్ ఆడుకోవడం మొదలు పెట్టాడు. అలా ఆటలాడుతున్న క్రమంలో పాము షరీఫ్ కుడి చేతిపై కాటు వేసిందని స్థానికులు తెలిపారు. విషం ఎక్కిన విషయం కూడా తెలియకుండా కొద్ది దూరం నడిచిన షరీప్ అకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.