Mancherial: భారీ వర్షాలు, వరదలు కారణంగా విష పురుగులు ముంపు ప్రాంత ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్ళు.. ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని ప్రాణ భయంతో బతుకుతున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పాముల బెడద ఎక్కువైంది. ఆసుపత్రి వరద తాకిడికి గురవ్వడంతో ఆసుపత్రి ఆవరణలో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో సునీత అనే మహిళ పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రం చేస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. దీంతో ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని, అయితే వాటిని బయటకు తరిమివేసినట్లు పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు. కిటీకీలు, నేల మీద పాములు కదులుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Mumbai: లక్షలు మోసపోయిన సినీ నటి! ఇండస్ట్రీ అంతా ఈమె గురించే టాపిక్!
ఇది కూడా చదవండి: Maharashtra Islampur: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఎద్దుల బండిని కనిపెట్టింది వీళ్ళే!