ఈ మద్య పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని మానవ తప్పిదాల వల్ల అయితే మరికొన్ని సాంకేతిక లోపాలు సంబవించడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. లోకో పైలెట్స్ సమస్యలను సకాలంలో గుర్తించడం వల్ల ప్రమాదాలు తప్పుతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రైళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక లోపాల వల్ల బోగీల్లో మంటలు రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్నిసార్లు ఈ ప్రమాదాల్లో పలువురికి తీవ్ర గాయాలు కావడమే కాదు.. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఆదివారం ఉదయం నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పొగలు రావడంతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో రైలుని స్టేషన్ లో నిలిపివేశారు.
నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కి పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం అకస్మత్తుగా పొగలు చెలరేగాయి. రన్నింగ్ లో ఉన్న ట్రైన్ అకస్మాత్తుగా బ్రేక్ లైనర్స్ పట్టేయడంతో దట్టమైన పొగలు వచ్చాయి.. అది గమనించిన లోకో పైలెట్ అప్రమత్తమయ్యాడు.. వెంటనే అధికారులకు సమాచారం అంధించారు. వెంటనే అధికారులు ఆ ట్రైన్ ని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.
రైల్వే సిబ్బంది ఫైర్ సెఫ్టీ సిలీండర్ ద్వారా పొగలను కంట్రోల్ చేసి ఆర్పివేశారు. తర్వాత ట్రైన్ యధావిధిగా నడిచింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే ట్రైన్ లో ఒక్కసారే పొగలు రావడంతో ప్రయాణీకులు కొంతమంది భయంతో ట్రైన్ దూకి పారిపోయారు. ఈ ప్రమాద ఘటన కారణంగా రైలు సుమారు గంట ఆలస్యమైంది. గత ఏడాది ఏపిలో గూడూరు లో నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు వ్యాపించాయి.. వెంటనే అధికారులు అప్రమత్తమైన మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎండాకాలం ఇటాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి.