సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారి స్మితా సబర్వాల్ గురించి తెలిసిందే. ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. ప్రజల్లోనూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అలాంటి స్మితా సబర్వాల్ తాజాగా తన వయసు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఐఏఎస్ ఆఫీసర్లకు ప్రజల్లో ఉండే గౌరవం గురించి పత్ర్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ విధానాలను అమలు పరచి పర్యవేక్షించే సివిల్స్ అధికారులకు ప్రజలు చాలా మర్యాద ఇస్తారు. వాళ్లకు తమ గోడు చెప్పుకుంటారు. తమ కష్టనష్టాలు తీర్చాలని వేడుకుంటారు. అధికారులు కూడా వాటిని పరిష్కరించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక, సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారి స్మితా సబర్వాల్ గురించి తెలిసిందే. ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతలను, ఆయా శాఖల్ని సమర్థంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారామె. ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి కూడా తెలిసిందే.
అలాంటి స్మితా సబర్వాల్ తాజాగా నిజామాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో కామారెడ్డిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలతో ముఖాముఖిలో ముచ్చటించారు. గర్భిణులతో ఇంటరాక్షన్ సమయంలో స్మితా సబర్వాల్ తన వయసు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. ఈ క్రమంలో ఓ గర్భిణీ స్మితా సబర్వాల్‌ను ‘మీరు చాలా బాగున్నారు మేడం’ అని అన్నారు. దీంతో ఆ సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఆ గర్భిణీ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు వెంటనే తడుముకోకుండా ధన్యవాదాలు చెప్పిన స్మితా సబర్వాల్.. తన ప్రసంగాన్ని కొనసాగించారు.
‘తల్లి కావడం దేవుడు ఇచ్చిన వరం. మీ చేతుల్లోనే మీ పిల్లల ఆరోగ్యం, కుటుంబం ఆధారపడి ఉంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా వయసు తక్కువని మీరు అనుకుంటారు.. కానీ నాకు వయసేమీ తక్కువ కాదు. మీ అందరి కంటే డబుల్ ఏజ్ నాది. నా కొడుకు వయసు ఇప్పుడు 18. నేను మదర్ హార్లిక్స్ తాగుతాను. కర్జూరం తింటాను. మంచి ఆహారాన్ని తీసుకుంటేనే ఇంటి బాధ్యతలు, ఉద్యోగం చేయడానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. నేను అమ్మ అయిన సమయానికే కలెక్టర్‌గా ఉన్నా. మహిళలపై చాలా బాధ్యతలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అవన్నీ సక్రమంగా ఉంటాయి’ అని స్మితా సబర్వాల్ చెప్పుకొచ్చారు.