తెలంగాణ ఉద్యమ సమయంలో తన గానంతో కోట్ల మంది తెలంగాణ ప్రజలను జాగృత పరిచారు ప్రజా గాయకుడు గద్దర్.
ఇటీవవల సినీ, రాజకీయ నేతలు వరుసగా కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు పలువురు సెలబ్రెటీలు చనిపోతున్నారు. తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లమంది తెలంగాణ ప్రజలను మేల్కొలిపారు. ఇప్పటికీ ఆయన పాటలు పల్లెల్లో వినిపిస్తూనే ఉంటాయి. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్యం అధికారికంగా ప్రకటించారు. గద్దర్ చనిపోయిన విషయం తెలిసి యావత్ తెలంగాణ ప్రజానికం, రాజకీయ నేతలు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించాడు. గత కొద్దికాలంగా గద్దర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్ అసలు అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. అందరికీ ఆయన ప్రజా గాయకుడు గద్దర్‌గా సుపరిచితం. ఆయన ఎడ్యూకేషన్ నిజామాబాద్, మహబూబ్ నగర్ లో సాగింది. ఇంజనీరింగ్ హైదరాబాద్ కి వచ్చి పూర్తి చేశారు. కొన్ని సినిమాల్లో ఆయన నటిస్తూ.. పాటలు పాడారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు గద్దర్. తెలంగాణ ప్రజల్లో తన పాటలు, బుర్రకథలతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఆయన మృతిపట్ల ఉద్యమనేతలు, రాజకీయ, సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ.. నివాళులర్పిస్తున్నారు.
ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి.#Gaddar pic.twitter.com/GufSegDeJN
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2023