అమ్మ.. తన పిల్లల అభివృద్ధి కోసం ఎటువంటి కష్టమైన ఎదుర్కొంటుంది. తన చివరి శ్వాస వరకు కూడా బిడ్డల కోసం తల్లి పరితపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయో ఈ అమ్మ కూడా ఆ కోవకు చెందిన వారే. కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణించాడు. అయినే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్ని కుమాడిని ఎస్సై చేసింది
ఈ భూమిపై వెలకట్టలేనిది అంటూ ఒకటి ఉంది అంటే.. అది తల్లి ప్రేమ మాత్రమే. కన్నతల్లి రుణం ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోలేము. ఎందుకంటే ఆమె ప్రేమ నిస్వార్ధమైనది. అలానే పిల్లల అభివృద్ధి కోసం ఎటువంటి కష్టమైన ఎదుర్కొంటుంది. తన చివరి శ్వాస వరకు కూడా బిడ్డల కోసం తల్లి పరితపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయో ఈ అమ్మ కూడా ఆ కోవకు చెందిన వారే. కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణించాడు. అయినే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్ని కుమాడిని ఎస్సై చేసింది. మరి.. ఆ తల్లి విజయగాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండంలం పిప్రి గ్రామానికి చెందిన దొరగారి హనుమవ్వ కుమారుడు రాజారెడ్డి ఎస్సైగా సెలక్ట్ అయ్యాడు. ఆయన ఎస్సైగా మారడం వెనుక హనుమవ్వ కష్టం ఎంతో ఉంది. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. హనుమవ్వ.. ఎన్నో ఆశలతో అత్తగారింట అడుగు పెట్టింది. అలానే కొంతకాలం భర్తతో ఆమె సంసారం హాయిగా సాగింది. అయితే హనుమవ్వ ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో ఆమె భర్త అకాల మరణం చెందాడు.
దిక్కుతొచని స్థితిలో అత్తగారింటి వద్ద వ్యవసాయం మొదలు పెట్టంది. మూడెకరాల పొలాన్ని నమ్ముకుని సాగుబాట పట్టింది. ఎండనక , వాననక.. కష్టపడి పంట సాగు చేస్తూ కొడుకుని చదివించింది. మధ్యలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో ఎకరన్నర భూమిని సైతం అమ్మేసింది. అయినా ఆత్మవిశ్వాసాని కోల్పోకుండా ఉన్న పొలంలోనే శ్రమించింది. సాగు చేసిన పంటలను అమ్మడానికి నిజామాబాద్ గంజ్ కు వెళ్లేది. చివరకు అలా కష్టపడుతు కుమారుడిని చదివించి.. ఎస్సైని చేసింది.
తన కొడుకు ఎస్సై అయినా కూడా తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యవసాయాన్ని మాత్రం ఆమె మరవలేదు. తల్లి పడ్డ కష్టాన్ని వృథా చేయకుండా కొడుకు రాజారెడ్డి సైతం ఉన్నత చదువులు చదివి తొలుత కానిస్టేబుల్ గా ఎంపికై ఆ తరువాత ఎస్సై పరీక్షలు రాసి విజయం సాధించాడు. ప్రస్తుతం నవీపేట ఎస్సైగా రాజారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ బిడ్డను చదివించానని, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాని హనుమవ్వ తెలిపారు. కొడుకు ఎస్సై కావడంతో తన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరి.. ఈ అమ్మ విజయగాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.