సుమన్ టీవీ అలేఖ్యపై కథనాలు, వీడియోలు చేసింది. దీంతో అలేఖ్య కష్టం గురించి చాలా మందికి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆర్థిక సాయం అందించటానికి ముందుకు వస్తున్నారు.
పదవ తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించిన నిరుపేద విద్యార్థిని అలేఖ్యకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం లభిస్తోంది. ప్రముఖ డిజిటల్ మీడియా సుమన్ టీవీ కథనాలు, వీడియోలకు జనం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సుమన్ టీవీ ద్వారా అలేఖ్య కష్టం గురించి తెలిసి తమ వంతు సహాయం చేస్తున్నారు. అలేఖ్య.. పై చదువులు చదవాలని కోరుకుంటూ ఆర్థికంగా తోడ్పాటు నందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పటాన్ చెరువు సీఐ నూకల వేణుగోపాల్ రెడ్డి సుమన్ టీవీ కథనాలతో అలేఖ్య గురించి తెలుసుకున్నారు. ఆయన చేపట్టిన వన్ ఛాలెంజ్ ద్వారా అలేఖ్యకు రూ. 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తే అలేఖ్య. లక్ష్మమ్మకు అనారోగ్యం అని తెలియగానే ఆమె తండ్రి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో లక్ష్మమ్మ తన కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది. అలేఖ్యకు చిన్నప్పటినుంచి చదువంటే ప్రాణం. ఇన్ని కష్టాల్లోనూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. తల్లికి భారం కాకూడదని భావించి.. నిడమానూరు వసతిగృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో చదువుతోంది. అలేఖ్య టెన్త్‌కు వచ్చే సరికి లక్ష్మమ్మ ఆరోగ్యం క్షీణించింది.
ఫిబ్రవరిలో నెలలో ఆమె తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయింది. తల్లి చనిపోయిన బాధలో ఉన్నా.. అలేఖ్య తన చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇష్టపడి చదివింది. టెన్త్‌లో 9.7 జీపీఏ సాధించింది. అయితే, పై చదువులు చదవటానికి ఆర్థిక స్థోమత చాల్లేదు. ఆ విషయంలోనే ఆమె మధనపడుతూ ఉండేది. అలేఖ్య ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు కొంత సహాయం చేశారు. సుమన్ టీవీ కథనాలు ఎంతో మంది సహాయం చేస్తూ ఉన్నారు. అలేఖ్య ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పని చేస్తోంది. మరి, అలేఖ్య కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.