ఐదు రోజుల పాటు చికిత్స పొంది ఆదివారం మెడికో విద్యార్థిని ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కానీ, ఆమె పోస్ట్ మార్టం ఇంకా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే?
వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ప్రీతి.. ఆదివారం ప్రాణాలు విడిచింది. డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో ముందుకు వెళ్లి.. చివరికి సీనియర్ విద్యార్థి సైఫ్ అనే దుర్మార్గుడి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రీతి మరణంపై రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు చాలా మంది స్పందిస్తున్నారు. ఆమె మరణానికి కారణమైన నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని ప్రీతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి ప్రీతి చికిత్స సమయంలో వైద్యులు ఆమె బయాప్సీ రిపోర్ట్ ను తీసుకున్నారు. ఆ రిపోర్ట్ ఫలితం వెల్లడైన తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్టును విడుదల చేస్తామని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఇక మొత్తానికి ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం కానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రీతి ఆత్మహత్యపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి వాడిన ఇంజక్షన్ ఏంటి? ఆమె ఒంటిపై ఏమైనా గాయాలు ఉన్నాయా? నిజంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ బయాప్రీ రోపోర్ట్ రావడానికి కాస్త సమయం పడుతుందని, దీని కారణంగానే ప్రీతి పోస్ట్ మార్టం కాస్త ఆలస్యంగా రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.
మొత్తానికి ప్రీతి ఆత్యహత్యపై పలు అనుమనాలకు సమాధానం దొరకాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదని వైద్యులు తెలిపారు. ఇక ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొండకండ్ల మండలం గిర్ని తండాకు పోలీసులు భారీ బందోబస్తు నడుమ అక్కడికి తరలించారు. ఇక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ప్రీతిని చివరి సారిగా చూసేందుకు గ్రామస్తులు, చుట్ట పక్క గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు.