ఆ బాలిక పేరు దీప్తి. ఖమ్మంలోని ఓ గురకుల పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. అయితే అక్కడ ఆ విద్యార్థినిని గత కొంత కాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి టార్చర్ ను భరించలేకపోయిన ఆ బాలిక.. తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఆ విద్యార్థి వారి వేధింపులు తట్టుకోలేకపోయింది. అయినా సరే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశపడింది. కానీ, అదేది ఆమెకు కనిపించలేదు. ఇక వారి టార్చర్ ను భరించలేకపోయిన ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని ఓ గురుకులంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది? అసలేం జరిగిందంటే?
తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలోని ఓ గురుకుల పాఠశాలలో కడారి దీప్తి అనే బాలిక 10వ తరగతి చదువుతుంది. అయితే ఆ విద్యార్థి రోజూ క్లాస్ కు వెళ్లి తిరిగి హాస్టల్ కు వచ్చేది. ఈ క్రమంలోనే తోటి స్నేహితులు ఆమెను అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతూ వచ్చారు. తోటి స్నేహితులే కదా ఆటపట్టిస్తుంటారని ఆ విద్యార్థినిని ఇన్నాళ్లు వారి టార్చర్ ను భరిస్తూ వచ్చింది. ఇక రాను రాను వారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ క్రమంలోనే దీప్తి నిద్రమాత్తలు వేసుకుందని ఉపాధ్యాయులకు కొందరు స్టూడెంట్స్ తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది.
దీనిని తట్టుకోలేకపోయిన దీప్తి శుక్రవారం నిద్రమాత్తలు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఈ విషయాన్ని దీప్తి తల్లిదండ్రులకు తెలియజేశారు. హుటాహుటిన హాస్టల్ కు వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆ బాలికకు చికిత్స అందిస్తున్నట్లు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గురుకులంలో ఉపాధ్యాయులు కనీస పర్యావేక్షణ ఎలా ఉందో అద్దం పడుతుందని మండిపడుతున్నారు. తోటి విద్యార్థుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈ విద్యార్థి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.