ఓ దుర్మార్గపు తండ్రి కన్న కూతురిపైనే కన్నేశాడు. కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి అనేక సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసుపై తాజాగా న్యాయస్థానం స్పందించి సంచలన తీర్పును వెలువరించింది.
ఈ రోజుల్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండాపోతోంది. రోడ్డుపై అమ్మాయి కనపడితే చాలు.. ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, ఆపై అత్యాచారాలు. ఇవే నీటి కాలంలో జరుగుతున్న దారుణాలు. బయటే అమ్మాయిలకే రక్షణ లేదనుకుంటే.. ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు ఇంటివాళ్లతోనే రక్షణ లేకుండాపోయింది. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ దుర్మార్గపు తండ్రి.. కన్న కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోగా.. తాజా విచారణలో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.
అసలేం జరిగిందంటే?.. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఓ వ్యక్తి (40) నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై ఓ కూతురు (16) కూడా ఉంది. అయితే ఆ వ్యక్తి నగరంలోనే ఓ కంపెనీలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుండేవాడు. అయితే రాను రాను ఇతడు రాక్షసుడిగా మారి.. కన్న కూతురిపైనే కన్నేశాడు. భార్య పగలు పనికి వెళ్లడం చూసిన భర్త… తన కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భవతి కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించారు.
2021లో జరిగిన ఈ కేసుపై తాజాగా స్పందించిన నాంపల్లి సెషన్స్ కోర్టు.. నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కన్న కూతురిపై కనికరం లేకుండా పాడు పనికి కాలు దువ్విన ఈ ఘటనపై కోర్టు తీర్పుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది దుర్మార్గులు మత్తుకు బానిసై వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి యావజ్జీవకారాగార శిక్ష విధించిన న్యాయస్థానం తీర్పుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.