ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. చదువుల ఒత్తిడి కారణంగా తన ప్రాణాలను తీసుకున్నాడు సాత్విక్. అయితే ఈ క్రమంలోనే నాగచైతన్య ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలు, హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. నవీన్, ప్రీతి, రక్షిత మరణ వార్తలు మరువక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. హైదరాబాద్ లోని నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి మంగళవారం క్లాస్ రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాద్యాయుల వేధింపుల కారణంగానే మరణించినట్లు సాత్విక్ సూసైడ్ నోట్ లో రాసుకొచ్చాడు. ఇక చేతికి ఎదిగి వస్తాడు అనుకున్న కొడుకు ఇలా శవంలా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే సాత్విక్ మరణంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీరో నాగచైతన్య ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది.
సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురి చేసింది. ఉన్నత చదువులు చదువుని కంటికి రెప్పలా మమ్మల్ని చూసుకుంటాడు అనుకున్న కొడుకు ఇలా.. ఉరి తాడుకు వేలాడుతాడని ఆ తల్లి దండ్రులు ఊహించి ఉండరు. చదువుల ఒత్తిడి కారణంగానే సాత్విక్ తనువు చాలించాడని సూసైడ్ నోట్ ద్వారా తెలస్తోంది. ఈ క్రమంలోనే సాత్విక్ మృతి తర్వాత సోషల్ మీడియాలో నాగచైతన్య జోష్ సినిమాలో ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. జోష్ సినిమాలో డిస్కో మీటింగ్ లో విద్యార్థులు-చదువు, ఒత్తిడి గురించి నాగచైతన్య ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు.
ఇక ఆ స్పీచ్ లో నాగచైతన్య ఈ విధంగా మాట్లాడాడు.”చదువు, తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు ఒక విద్యార్థికి ఏం నేర్పిస్తున్నారు? అసలు వాడు ఏం నేర్చుకుంటున్నాడు? ఇక చదువు ఒక్కటే జీవితమా? ఈ ప్రపంచంలో చదువు లేని వారు, చదువుకోని వారు ఎంతో సాధించారు. ఇక మీ చదువుల ఒత్తిడి కారణంగా సగటున రోజుకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు” అని నాగచైతన్య జోష్ సినిమాలో చెప్పుకొచ్చాడు.
ఇక కాలేజ్ లు దేశాన్ని నిర్మించే ల్యాబ్ లు అయితే.. విద్యార్ధులు కేవలం ముడిసరుకులు మాత్రమే అని పరికరాలు ఇచ్చి, ప్రయోగాలు చేయాల్సింది మీరు.. అది వదిలేసి విద్యార్థుల మీద పడతారు అంటూ చైతూ చెప్పిన ప్రతీ మాట ఇప్పటి కాలేజ్ యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు చక్కగా సరిపోతాయి. అసలు వాడి మనసులో ఏముందో కనుక్కోకుండా నువ్వు డాక్టర్ అవ్వు.. ఇంజినీర్ అవ్వు.. అంటూ మీ కోరికలకు పిల్లలపై రుద్దడం వల్లే విద్యార్థులు ఇలా తయ్యారు అవుతున్నారు అని చైతూ జోష్ సినిమాలో చెప్పిన డైలాగ్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. నిజమే ఎవరి టాలెంట్ ఎంటో గుర్తించి ప్రోత్సహిస్తే.. ఆ పిల్లలు భవిష్యత్ లో ఎంతో గొప్పవారు కచ్చితంగా అవుతారు.