భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాట పాడి ఆకట్టుకున్న జానపద గాయకుడు కిన్నెర మొగులయ్యను ఆర్టీసీ ప్రచారంలో భాగం చేశారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాట పాడిన తర్వాత మొగులయ్యకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక తెలంగాణ ఆర్టీసీని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వినూత్న ప్రయత్నాలను అమలు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్టీసీపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని కల్పించేందుకు చేస్తున్న ప్రకటనల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ట్విట్టర్ లో వెంటనే స్పందిస్తున్నారు. ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా తన కూతురు వివాహానికి రెండు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొన్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకొన్న విషయం విదితమే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు టీఎస్‌ఆర్టీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. లక్షకు పైగా వ్యూస్ రావటంతో దాన్ని ఆర్టీసీ గుర్తించింది.
సంస్థకు సానుకూల ప్రచారం చేసినందుకు మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. మొగులయ్య పాట పట్ల ధన్యవాదలు తెలిపారు. బస్‌భవన్‌లో బుధవారం సన్మానించారు. అలాగే కిన్నెర మొగులయ్య కు బంపర్ ఆఫర్ కూడా ప్రకటించాడు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. అంతేకాదు భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్ కోరారు.
కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa
— Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021