పేరు ఎల్లమ్మ. వయసు 48 ఏళ్లు. భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి గ్రామంలో కూలీనాలీ చేసుకుంటూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. అయితే ఎప్పటిలాగే బుధవారం కూడా ఉపాధి పనులకు వెళ్లింది. కానీ, సాయంత్రం శవమై ఇంటికి వచ్చింది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఎల్లమ్మ. వయసు 48 ఏళ్లు. భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి గ్రామంలో కూలీనాలీ చేసుకుంటూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. అయితే ఎంతో హుషారుగా ఉండే ఎల్లమ్మ ఎప్పటిలాగే బుధవారం కూడా ఉపాధి పనులకు వెళ్లింది. కానీ, సాయంత్రం శవమై ఇంటికి వచ్చింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఏపూర్ గ్రామం. ఇక్కడే రావుల ఎల్లమ్మ (48) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అయితే ఎల్లమ్మ భర్త గత 10 ఏళ్ల కిందటే అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ గ్రామంలో ఏదో పని చేస్తూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇక పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ గొప్పగా తీర్చుదిద్దాలని అనుకుంది.
ఇదే కాకుండా ఎల్లమ్మ ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లేది. అయితే ఎప్పటిలాగే ఆమె బుధవారం అందరితో పాటు ఉపాధి పనికి వెళ్లింది. ఫీల్డ్ లో అందరితో కలిసి పనులు చేసింది. అయితే పని చేస్తున్న క్రమంలోనే ఎల్లమ్మ ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది. వెంటనే స్పందించిన ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు ఎల్లమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఎల్లమ్మ అప్పటికే గుండెపోటుతో మరణించిందని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న ఆమె కొడుకులు, కూతురు గుండెలు పగిలేలా ఏడ్చారు.
అనంతరం ఉపాధి కూలీ ఎల్లమ్మ మృతిపై స్థానిక ఏపీవో స్పందించారు. ఆమె పిల్లలను పరామర్శించి ప్రభుత్వ తరుఫు నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. అయితే గతంలో తండ్రి, ఇప్పుడు తల్లి మరణించడంతో ఎల్లమ్మ పిల్లలు అనాధాలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లమ మృతితో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.