భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఓ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సచిన్ రామ్ చరణ్ ను కలిశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకే సచిన్.. రామ్ చరణ్ ను ఎందుకు కలిశారంటే?
భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. భారతదేశంలోనే తొలి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్ వద్ద ఈ ప్రిక్స్ లో ఈ రేస్ జరుగుతుంది. శనివారం నుంచి జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ రేసుకి సంబంధించి 8 సీజన్లు ముగియగా.. తొమ్మిదో సీజన్ యొక్క నాల్గవ రౌండ్ ఇవాళ జరగనుంది. గత పదేళ్లలో మొదటి మోటార్ స్పోర్ట్ ఈవెంట్ కావడంతో సందడి నెలకొంది. ఈ రేసులో 11 జట్లు పోటీపడుతుండగా.. 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు.
ఇండియా నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో 2.8 కి.మీ. పొడవైన సర్క్యూట్ ని రెడీ చేయగా.. 18 మలుపులను ఏర్పాటు చేశారు. ఈ రేసుని 20 వేల మంది ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం క్వాలిఫయింగ్ రేసు జరగగా. మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేసు ప్రారంభం కాబోతుంది. ఈ రేసు దాదాపు గంటన్నర పాటు జరగనుంది. ఈ రేసుని వీక్షించేందుకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కేటీఆర్, రామ్ చరణ్, సచిన్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT
— Bharat Sharma (@sharmabharat45) February 11, 2023
ఇక ఈ ఈవెంట్ కు సచిన్ రావడంతో సందడి నెలకొంది. 12 సంవత్సరాల క్రితం ఫార్ములా 1 రేసు ప్రారంభంలో కనిపించిన సచిన్.. ఇప్పుడు భారతదేశంలోనే తొలి ఫార్ములా ఈ రేస్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రాలతో కలిసి సచిన్ ఫోటోలకు ఫోజులిచ్చారు. రామ్ చరణ్ తో ఉన్న సచిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చిన సచిన్ పై, అలానే దేశంలోనే తొలి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరుగుతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.