తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్త నదైన మార్క్‌ను కనబరచడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆర్టీసీ అభివృద్ది చేసేందుకు, అదే విధంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. టీఎస్ ఆర్టీసీ లాభాల బాట పట్టించడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. పండుగల సందర్భంగా మహిళల కోసం, విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్స్, వృద్ధులకు ఉచిత ప్రయాణం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు సజ్జనార్ మరో శుభవార్త చెప్పారు. వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న నూతన దంపతులకు కానుక ఇచ్చే కార్యక్రమానికి ఎండీ వీసీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. వివాహాది శుభకార్యాలు.. మరే ఇతర శుభ కార్యక్రమాలు జరుపుకునే వారు ఒక నెల ముందు ‘టీఎస్ ఆర్టీసీ’ బుక్ చేసుకుంటే వారికి 20 శాతం రాయితీ ఉంటుందిన.. సాధారణ చార్జీలకంటే 15 శాతం తగ్గింపు లభిస్తుందని తెలిపారు. ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడు శుభకార్యాలు బాగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నారు.