ఈ మధ్యకాలంలో ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలు వరువకముందే తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
గత కొన్ని రోజుల నుంచి గుండె పోటుతో జనాలు పిట్టాల్లా రాలుతున్నారు. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వరుస గుండెపోటు మరణాలు మరువకముందే తాజాగా సిద్దపేట జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు గ్రామంలో పొన్నాల కిషన్ అనే వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతడు గత కొన్ని రోజులు మాల దారణలో ఉన్నాడు. అయితే తాజాగా మాల విరమణ కోసం కిషన్.. జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చాడు. ఆలయం ముందు కూర్చుని ఉండగా అతడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన కిషన్.. ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడంతో గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.