ఈ మధ్య కాలంలో ఆహార కల్తీల గురించి నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న షాపుల్లోనే ఇలా జరుగుతుంది అనుకుంటే.. ఇక మాల్స్‌లో కూడా కల్తీలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా జీడిమెట్ల రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఈ తరహా సంఘటన వెలుగు చూసింది.
ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా సరే.. మాల్స్‌కే వెళ్తున్నాం. నెల వారీ సరుకులు తీసుకురావడానికి డీమార్ట్, మోర్, జియో స్మార్ట్ వంటి మాల్స్‌కి వెళ్లి.. మనకు తెలీకుండానే వెలల్లో బిల్లు చేసుకుని బయటకు వస్తాం. ఏదో చిన్న చిన్న అవసరాల కోసం మాత్రమే కిరాణా షాపులకు వెళ్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడం కోసం ఈ మాల్స్ రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి. అయితే మాల్స్‌లో దొరికే సరుకులు అన్ని నాణ్యమైనవే ఉంటాయా.. అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేం. చాలా మాల్స్‌లో నకిలీ ఆహారపదార్థాలను అమ్ముతుంటారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇక తాజాగా రత్నదీప్ స్టోర్‌లో పాడైన ఆహార పదార్థాలు అమ్మడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన జీడిమెట్ల పరిధిలోని సుచిత్ర రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో.. సోమవారం వెలుగు చూసింది. ఓ కస్టమర్ రత్నదీప్ మార్కెట్‌లో చికెన్ నగ్గెట్స్ కొనుగోలు చేవాడు. ఇంటికెళ్లి వాటిని తెరిచి చూస్తే.. పాడైన వాసన వచ్చింది. అన్ని డబ్బులు తీసుకుని.. పాడైన ఆహార పదార్థాలు విక్రయించారనే కోపంతో సదరు కస్టమర్ సూపర్ మార్కెట్ దగ్గరకు వెళ్లి.. దీని గురించి సిబ్బందిని ప్రశ్నించాడు. అంతేకాక అక్కడ ఉన్న మిగతా చికెన్ నగ్గెట్స్ ప్యాకెట్స్‌ను కూడా ఒపెన్ చేయగా.. అవి కూడా పాడైనట్లు తెలిసింది. ఇదే సమయంలో మరో ఇద్దరు కస్టమర్లు.. పాడైన నగ్గెట్స్ ప్యాకెట్స్ తీసుకుని స్టోర్ దగ్గరకు వచ్చారు. అందరూ కలిసి దీని గురించి స్టోర్ సిబ్బందని నిలదీశారు.
వందలకు వందల రూపాయలు డబ్బులు తీసుకుని.. తమకు ఇలా పాడైన ఆహార పదార్థాలు అంటగడతారా అని ప్రశ్నించారు కస్టమర్లు. దీనికి సమాధానం చెప్పాలని స్టోర్ సిబ్బందిని నిలదీయడంతో.. అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే రత్నదీప్ స్టోర్ మేనేజర్.. కస్టమర్లకు సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. కానీ కస్టమర్లు అక్కడే కూర్చొని ఆందోళణ చేయడంతో.. విషయం తెలుసుకున్న.. మరో ఏరియా స్టోర్ మేనేజర్ అక్కడకు చేరుకున్నాడు. రేపు మాట్లాడుకుందామంటూ కస్టమర్లకు నచ్చచెప్పాడు. కస్టమర్లను పంపించిన అనంతరం సిబ్బంది వెంటనే స్టోర్ క్లోజ్ చేశారు. దీంతో బాధిత కస్టమర్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రత్నదీప్ స్టోర్‌లో పాడైన ఆహార పదార్థాల అమ్మకం.. ఆందోళన చేస్తోన్న కస్టమర్లు! pic.twitter.com/bcdjPQGzBT
— Rajasekhar (@Rajasek61450452) May 16, 2023