బాధ వచ్చినా, ఆనందం వచ్చినా పంచుకునేది స్నేహితుడితోనే, సలహా, సూచనలు అడిగేది వారినే. ఒకరికి ఒకరు తోడుగా.. చేదోడు వాదోడుగా ఉంటున్న ముగ్గురు మంచి మిత్రులను..మరణం కూడా విడదీయలేకపోయింది. చేతికి వచ్చిన కొడుకులు..
ఈ ప్రపంచంలో అన్నింటిని మించిన బంధం స్నేహం. స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. స్నేహితుడు లేని మనిషి ఉండడు. ‘ఒంటరైనా, ఓటమైనా, వెంట నడిచి నీడ నీవా.. ఓ మై ఫ్రెండ్.. తడి కన్నులనే తుడిచినా నేస్తమా.. ఒడిదుకులలో నిలిచిన స్నేహమా’అని సినీ కవి కలం నుండి జాలు వారినదీ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురైన అనుభవాల పాఠాల నుండే. బాధ వచ్చినా, ఆనందం వచ్చినా పంచుకునేది స్నేహితుడితోనే, సలహా, సూచనలు అడిగేది వారినే. అలా ఒకరికి ఒకరు తోడుగా.. చేదోడు వాదోడుగా ఉంటున్న ముగ్గురు మంచి మిత్రులను..మరణం కూడా విడదీయలేకపోయింది. రోడ్డు ప్రమాదం ముగ్గురు స్నేహితులను బలితీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాకు చెందిన ఎండీ మొయిన్ ఖాన్, రాగోజిపేటకు చెందిన గోకుల అభిషేక్, మేడిపల్లికి చెందిన వరుణ్ సందీప్ గౌడ్ మంచి స్నేహితులు. వీళ్ల ముగ్గురిది పేద కుటుంబమే. ఈ ముగ్గురు చదువుకుంటూనే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. శుభకార్యాలయాల్లో క్యాటరింగ్ పనులు చేస్తూ కొంత గడిస్తున్నారు. కొడిమ్యాలలోని జరిగే ఓ వివాహా వేడుకకు వంటలు తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. క్యాటరింగ్ పూర్తయ్యాక సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు . కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలోకి రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ బలంగా డీకొట్టింది.
ఆ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో అక్కడ ఉన్న స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో గోకుల అభిషేక్, ఎండీ మెుయిన్ ఖాన్ మృతి చెందారు. మరొక స్నేహాతుడు వరుణ్ సందీప్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని మరొక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆ యువకుడు మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకులు కళ్లముందే విగత జీవులుగా మారిపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలస్తున్న ఈ ముగ్గురు.. రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బంధువులు, మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.