తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గట్టి పోరాటమే చేస్తుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్లు, జూనియర్లతో కలిసి పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో అధికార పక్షంపై ప్రతిపక్షాలు ఏ చిన్న కారణం దొరికినా దుమ్మెత్తి పోస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఓ వైపు అధికార పార్టీ తాము చేస్తున్న అభివృద్ది పనుల గురించి మాట్లాడితే.. ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ లో టీ కాంగ్రెస్ కి గట్టి బలం చేకూర్చేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. సీనియర్లు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ వర్గాల వారిని కలుస్తూ ముందుకు సాగుతున్నారు.
రేవంత్ రెడ్డి రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నేడు 11వ రోజుకు చేరింది. నేడు ఆయన సేష్టన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తన యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ రైతులను కలిసి వారి కష్టాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఓ రైతు అరక దున్నుతుంటే అతని వద్దకు వెళ్లి సేద్యం తీరు తెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన కూడా అరక దున్నే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి వచ్చిన జన సమూహాన్ని చూసి ఎద్దులు బెదిరి పోయాయి.. వాటిని నియంత్రించేందుకు రేవత్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. పొలం దున్నుతున్న సమయంలో తాను పడ్డ ఇబ్బంది గురించి రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు.
రేవంత్ రెడ్డి ‘మన ఇళ్లలో ఎంతో సౌకర్యవంతంగా ఆహారాన్ని తింటున్నాం.. కానీ పొలాల్లో రైతులు ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. రైతులందరికీ నా సెల్యూట్ ’ అంటూ ట్విట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ పాదయాత్రలో స్థానిక నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకుంటు ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.
It’s tough to understand the hard work put in by farmers on fields for us to enjoy food at the comfort of our homes..
My salutes to all the #Farmers#Day11YatraForChange #YatraForChange #StationGhanpur#HaathSeHaathJodo #FarmersLivesMatter pic.twitter.com/a5WmQqhDKm— Revanth Reddy (@revanth_anumula) February 17, 2023