ప్రస్తుతం మిర్చీ ధర ఏకంగా బంగారంతో పోటీపడుతోంది. ఎప్పుడూ లేనిది రికార్డుస్థాయిలో క్వింటాల్ మిర్చీ ధర ఏకంగా రూ.52 వేలు పలికింది. వరంగల్ ఎనుమానుల మార్కెట్ లో దేశీ మిర్చి ధర బంగారాన్ని రీచ్ అయ్యింది. తెగుళ్ల కారణంగా తెలుగు రాష్ట్రాలు సహా చాలా చోట్ల మిర్చి దిగుబడి తగ్గిపోయింది. ఉన్న కాస్తో కూస్తో పంటను వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. డిమాండ్ తగిన సప్లై లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. మార్చి నెల మొదటివారం నుంచి ధర పెరుగుతూనే ఉంది. ఈ నెల 3న దేశీయ మిర్చి క్వింటాల్ ధర రూ.32 వేలు పలికింది. అదే రికార్డు అనుకుంటే ఆ తర్వాత అది రూ.40 వేలకు చేరుకుంది. తాజాగా వరంగల ఎనుమానుల మార్కెట్ లో క్వింటాల్ మిర్చి రూ.52వేలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదీ చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
బుధవారం ములుగు జిల్లాకు చెందిన బలుగూరి రాజేశ్వరరావు అనే రైతు 7 బస్తాల మిర్చిని మార్కెట్ కు తీసుకురాగా.. క్వింటాల్ రూ.52 వేలు పలికింది. ప్రస్తుతం తులం బంగారం రూ.52 వేలు ఉండగా.. మిర్చి బంగారంతో పోటీపడి ధర పెరుగుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల వల్ల వచ్చిన నష్టం ఈ రేటుతో భర్తీ కావచ్చని రైతులు భావిస్తున్నారు. క్వింటాల్ రూ.52 వేలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.