సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించించారు. ఇప్పటి వరకు దేశంలో చేయని శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యరంగంలోనే కొత్త అధ్యయం లిఖించారు. ఆపరేషన్ చేసి బ్రీతింగ్ లంగ్‌ను మార్చారు. హార్ట్, ఊపిరిత్తుతల యంత్రాన్ని వినియోగించకుండా.. ఓ ఊపిరితిత్తితో సమన్వయం చేసుకుంటూ.. మరో ఊపిరితిత్తి పనిచేస్తుండగానే ఆపరేషన్ చేశారు. ఇప్పటివరకు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ విధానాన్ని హైదరాబాద్‌లోనే నిర్వహించి ఘనత సాధించారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తున్న మన హైదరాబాద్ వైద్యులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.