దేశంలో ఆడవాళ్లు ఒంటరిగా పట్టపగలు కూడా వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్న పిల్లలను సైతం వదలడం లేదు.
దేశంలో ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. కొన్నిచోట్ల అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తున్నారు. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారిపోతూ రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఓ ఆరేళ్ల చిన్నారిపై కామాంధులు అత్యాచార యత్నం చేయగా ర్యాపిడో డ్రైవర్ వెళ్లి కాపాడిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్.. నంద్యాలకు చెందిన కారంతోట్ కళ్యాణ్ (26) మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాలని ఇటీవల హైదరాబాద్ లో కోచింగ్ కోసం వచ్చాడు. పార్ట్ టైమ్ జాబ్ గా ర్యాపిడో డ్రైవర్ గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు ర్యాపిడో బుక్ చేయగా.. అతన్ని పికప్ చేయసుకోవడానికి ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లాడు కళ్యాణ్. ప్రయాణికుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో పక్కన పొదల నుంచి ఓ బాలిక అరుపులు వినిపించాయి. వెంటనే అలర్ట్ అయిన కళ్యాణ్ అటుగా వెళ్లి చూశాడు. ఓ 20 ఏళ్లు యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి సిద్దమయ్యాడు. వెంటనే అతన్ని ఆపి నిలదీయగా ఆ యువకుడు బాలిక తండ్రిని అంటూ బుకాయించాడు.
ఆ యువకుడు చెబుతున్న మాటలు కళ్యాణ్ కి నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో బాలికను ప్రశ్నించాడు.. ఆ బాలిక ఇతను తన తండ్రి కాదని.. తన తండ్రి ఎప్పుడో చనిపోయాడని.. తన తల్లితో ఉంటున్నా అని చెప్పింది. ఆ దుండగుడిని పాప పేరు ఏంటని ప్రశ్నించాడు.. అలాగే పాపను నీ పేరు ఏంటమ్మా అని ప్రశ్నించాడు. ఇద్దరు చెప్పినదానికి పొంతన లేకపోవడంతో 100 కి డైల్ చేశాడు. వెంటనే అక్కడికి పంజాగుట్ట పోలీసులు చేరుకొని యువకుడిని అరెస్ట్ చేశారు. కాగా, ఆ యువకుడు పండ్లు అమ్ముకునే అఫ్రోజ్ గా గుర్తించారు. బాలికను తమతో పాటు స్టేషన్ కి తీసుకు వెళ్లారు.. అప్పటికే రెండు గంటల నుంచి పాప కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చారు. కుటుంబ సభ్యుల గురించి వాకబు చేసి ఆ పాపను వారికి అప్పగించారు పోలీసులు.
Hear Kalyan narrate the incident & how he was able to stop a heinous crime involving a 6 yr old child.
You’ve not lived a life until you’ve done something for someone who can never repay you.@TelanganaDGP @Shikhagoel_IPS @rapidobikeapp #WomenSafetyWing #TelanganaPolice pic.twitter.com/Sv7dDqiPbv
— Women Safety Wing, Telangana Police (@ts_womensafety) May 8, 2023